షూటింగ్ కు తెచ్చిన బైక్, కారును ఇంటికి తెచ్చేసుకున్న ప్రభాస్!
- బైక్, కారుపై మనసు పారేసుకున్న ప్రభాస్
- 'సాహో' ఫైట్ సీన్ల షూట్ తరువాత ఇంటికి
- ఆగస్టు 15న రానున్న చిత్రం
ప్రస్తుతం 'సాహో'లో నటిస్తున్న హీరో ప్రభాస్, షూటింగ్ కోసం తెచ్చిన హై ఎండ్ బైక్, కార్ ను తన ఇంటికి తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ సినిమాలో స్టంట్స్ ను కోట్ల రూపాయలు వెచ్చించి షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఫైట్ సీన్లు తీస్తున్నప్పుడే, ఈ కారు, బైక్ పై ప్రభాస్ మనసు పడ్డాడని, అందుకే వాటిని తానే ఉంచేసుకోవాలని భావించారని సమాచారం. కాగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా, నీల్ నితిన్, ఎవ్లిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తుండగా, ఆగస్టు 15న చిత్రం విడుదల కానుంది.