అభిమానులు క్షమించాలి .. సినిమాలు మానేస్తాను: కమలహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానులు క్షమించాలి .. సినిమాలు మానేస్తాను: కమలహాసన్

  • శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2'
  • రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చానన్న కమల్ 
  • చేయాల్సినవి ఎన్నో వున్నాయంటూ క్లారిటీ  
ఒక వైపున రాజకీయ సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే, మరో వైపున 'భారతీయుడు 2' సినిమా షూటింగులో కమల హాసన్ పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత తాను ఇక నట జీవితానికి స్వస్తి చెబుతాననీ, పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని కొన్ని రోజుల క్రితం కమల్ ఒక వేదికపై అన్నారు. అయితే ఆయన నిజంగానే సినిమాలు చేయడం మానేస్తారా? మాట వరుసకు అలా అన్నారా? అనే సందేహం అభిమానుల్లో వుంది. తాజాగా కమల్ మాట్లాడుతూ ఆ సందేహాలకు తెరదించేశారు.

"ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో నా పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. అలాంటి అభిమానులంతా నన్ను క్షమించాలి .. ఎందుకంటే సినిమాలు . రాజకీయాలు ఒకే సమయంలో చేయలేను. రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను గనుక, చేసేందుకు చాలా పనులు వున్నాయి. ఆ పనులన్నీ కూడా త్వరత్వరగా చేస్తూ వెళ్లాలి" అని చెప్పుకొచ్చారు. కమల్ మాటల వలన ఆయన ఇక సినిమాలను దూరం పెట్టనున్నారనే విషయం స్పష్టమవుతోంది. 
kamal

More Telugu News