ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు.. నీ బతుక్కు తాటలు తీయడం కూడానా?: పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు
Add ap7am to your home Screen

ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు.. నీ బతుక్కు తాటలు తీయడం కూడానా?: పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టావ్
  • ఏప్రిల్ 11 వరకూ గంతులేసి వెళ్లు
  • నీ యజమాని బాబే అన్నీ సర్దుకుంటున్నాడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ అమ్ముడుపోయిన వ్యక్తి అని విమర్శించారు. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పవన్ కల్యాణ్ వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉల్లిపాయ మీద పొట్టును కూడా తీయని పవన్ కల్యాణ్ తాటలు తీయడం కూడానా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్నీ సర్ధుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Jana Sena
Pawan Kalyan

More Telugu News