మణిరత్నం మల్టీ స్టారర్లో విజయ్ సేతుపతి లేడట
Add ap7am to your home Screen

మణిరత్నం మల్టీ స్టారర్లో విజయ్ సేతుపతి లేడట

  • మణిరత్నం నుంచి మరో మల్టీ స్టారర్ 
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ 
  • వరుస డేట్స్ ఇవ్వలేనన్న విజయ్ సేతుపతి    
మణిరత్నం నుంచి ఇంతకుముందు వచ్చిన మల్టీ స్టారర్ మూవీ 'నవాబ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత గ్యాప్ తీసుకున్న ఆయన మరో మల్టీస్టారర్ మూవీకి అవసరమైన కథను సిద్ధం చేసుకున్నారు. రాజరాజ చోళుని చరిత్ర ఆధారంగా 'పొన్నియిన్ సెల్వం' టైటిల్ తో ఒక సినిమాను చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను విజయ్ సేతుపతి చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడనేది తాజా సమాచారం.

ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన, మణిరత్నం భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారు. ఈ కారణంగా ఎక్కువ రోజుల పాటు .. వరుసగా డేట్స్ ఇవ్వవలసి ఉంటుందని విజయ్ సేతుపతితో చెప్పారట. '96' .. 'సూపర్ డీలక్స్' తాజా విజయాలతో మాంచి ఊపుమీదున్న విజయ్ సేతుపతి, కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నాడు. అందువలన వరుసగా డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో, మణిరత్నం మరో స్టార్ హీరో కోసం గాలిస్తున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.
vijay sethupathi
manirathnam

More Telugu News