ప్రభాస్ తో జోడీ కడుతున్న సమంత?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ తో జోడీ కడుతున్న సమంత?

  • ముగింపు దశలో 'సాహో'
  • రెండో షెడ్యూల్లో 'జాన్' (వర్కింగ్ టైటిల్)
  • ఆ తరువాత సినిమా దిల్ రాజు బ్యానర్లో        
తెలుగు .. తమిళ భాషల్లో వరుస విజయాలతో సమంత దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో నటనకి ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను చేస్తూ మరిన్ని మార్కులను కొట్టేస్తోంది. అలాంటి సమంత త్వరలో ప్రభాస్ సరసన కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఒక వైపున 'సాహో' షూటింగులోను .. మరో వైపున 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు తరువాత ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒక క్రేజీ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తోన్న దిల్ రాజు, ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
prabhas
samanta

More Telugu News