శింబు సరసన ఛాన్స్ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్
- 'హలో'తో తెలుగు తెరకి పరిచయం
- తమిళంలో గట్టి ప్రయత్నాలు
- చేతిలో రెండు తమిళ సినిమాలు
ప్రస్తుతం తమిళంలో ఆమె శివకార్తికేయన్ సరసన 'హీరో' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో .. మరో ప్రాజెక్టుకు కల్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శింబు హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు ఒక పొలిటికల్ డ్రామాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన కల్యాణిని తీసుకున్నాడు. ఈ సినిమాకి 'మాన్నాడు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.