ఐదేళ్ల పాలనలో అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా చంద్రబాబు మారారు: వైఎస్ జగన్
- బాబు బాగుంటే, రాష్ట్రం బాగున్నట్టేనా?
- కర్నూలు జిల్లాలో మొదటి పంటకు సాగునీరు లేదు
- ఈ ఐదేళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయింది
ఈ ఐదేళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని, ఇక్కడి రైతు దేశంలోనే అత్యంత పేదవాడిగా ఉన్నాడని, డ్వాక్రా మహిళల రుణాలు తడిసి మోపెడయ్యాయని విమర్శించారు. చంద్రబాబు తన కొడుకుకి ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చాడని, ఆ తర్వాత మంత్రిగా ప్రమోషన్ చేశాడే తప్ప నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ‘మీ భవిష్యత్ నా భరోసా’ అంటూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.