Andhra Pradesh: చంద్రబాబు దొంగ ఫైళ్ల వ్యవహారాలన్నీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు లాకర్ లో ఉన్నాయి!: విజయసాయిరెడ్డి

  • ఎక్కడ వీటిని బయటపెడతాడో అని బాబు భయపడ్డారు
  • అందుకే ఎన్నికల సంఘాన్ని కూడా ఎదిరించారు
  • వెంకటేశ్వరరావు.. నిజాన్ని కక్కేయ్
ఏపీ సీఎం చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు సంబంధించిన దొంగ ఫైళ్ల వ్యవహారాలు అన్నీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు లాకర్ లో ఉన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ రహస్యాలను వెంకటేశ్వరరావు ఎక్కడ బయటపెడతాడో అన్న భయంతో చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కూడా ఎదిరించేందుకు సిద్ధమయ్యాడని దుయ్యబట్టారు. నాలుగు రోజులుండే పోస్టుకు పట్టింపులు ఎందుకనీ, తెలిసినదంతా కక్కేసి వెంకటేశ్వరరావు పాపప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.

విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చంద్రబాబు దొంగ వ్యవహారాల ఫైళ్లన్నీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు లాకర్‌లో ఉన్నాయి. రహస్యాలన్నీ ఎక్కడ బయట పెడతాడో అని ఆయన కోసం ఎలక్షన్ కమిషన్‌ను కూడా ఎదిరించేందుకు సిద్ధమయ్యాడు చంద్రబాబు. 4 రోజులుండే పోస్టు కోసం పట్టింపులెందుకు? ABV తెలిసిందంతా కక్కేసి పాప ప్రక్షాళన చేసుకో’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
ab venkatewararao
Vijay Sai Reddy
Twitter

More Telugu News