సాయిపల్లవితో ప్రేమ వార్తలపై స్పందించిన దర్శకుడు ఏఎల్ విజయ్
Add ap7am to your home Screen

సాయిపల్లవితో ప్రేమ వార్తలపై స్పందించిన దర్శకుడు ఏఎల్ విజయ్

  • సాయిపల్లవికి మంచి క్రేజ్ 
  • దర్శకుడిగా ఏఎల్ విజయ్ కి మంచి ఇమేజ్ 
  • అదంతా పుకారేనన్న విజయ్
తెలుగు .. తమిళ భాషల్లో నటిగా సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ వుంది. సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆ కథలో విషయం ఉందనే నిర్ధారణకు ప్రేక్షకులు వచ్చేస్తారు. ఆమె కథల ఎంపికపై అంతటి నమ్మకం వుంది. అలాంటి సాయిపల్లవి .. దర్శకుడు ఏఎల్ విజయ్ తో ప్రేమలో పడిందనీ .. ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు వున్నాయనే టాక్ వచ్చింది.

గతంలో ఈ దర్శకుడితో సాయిపల్లవి 'కణం' సినిమా చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై సాయిపల్లవి మౌనంగానే వుంది. తాజాగా ఏఎల్ విజయ్ స్పందిస్తూ .."నేను .. సాయిపల్లవి ప్రేమించుకుంటున్నట్టు .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమే" అంటూ పుకార్లకు తెరదింపేశాడు.
sai pallavi
al vijay

More Telugu News