చంద్రబాబును గెలిపించి కేంద్రంలో చక్రం తిప్పేలా చేయాలి: కేజ్రీవాల్
- మోదీ పోవాలి, చంద్రబాబు రావాలి
- అన్ని వర్గాల వారిని ఆదుకున్నారు
- మోదీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టారు
దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీని అభివృద్ధి చేశారని, వృద్ధులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. చంద్రబాబు ఎన్నో పథకాలు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అమలు చేశారని కేజ్రీవాల్ కొనియాడారు. మోదీ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లారని, తన స్వార్థం కోసం కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టారన్నారు. జగన్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమేనని ప్రజలు గుర్తించాలన్నారు.