అమెరికాలో ఉన్మాది వీరంగం.. ఇద్దరు వాహనదారుల కాల్చివేత.. పలువురికి తీవ్రగాయాలు!
- ఇద్దరు అమెరికన్ల పరిస్థితి విషమం
- ఈశాన్య సియాటెల్ లో ఘటన
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో అక్కడకు పోలీసులు చేరుకోవడంతో అటుగా వెళుతున్న బస్సుపై కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ సందర్భంగా శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయినప్పటికీ చాకచక్యంగా బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. డ్రైవర్ తో పాటు గాయపడ్డ మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
అక్కడితో ఆగకుండా అటుగా వెళుతున్న కారుపై కూడా ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కారును నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం కారును వేగంగా తీసుకెళ్లిన దుండగుడు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో అందులోని వ్యక్తి ప్రాణాలు వదిలాడు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.