nandita raj: విడుదలకి ముస్తాబవుతోన్న 'విశ్వామిత్ర'

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలలో 'గీతాంజలి' .. 'త్రిపుర' చిత్రాలకు ప్రత్యేక స్థానం దక్కిందనే చెప్పాలి. దర్శకుడు రాజకిరణ్ పట్టుగా నడిపించిన కథాకథనాలు అందుకు కారణమని చెప్పాలి. ఆయన దర్శకత్వంలో రూపొందిన మరో హారర్ థ్రిల్లర్ సినిమానే 'విశ్వామిత్ర'. నందితా రాజ్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమా ద్వారా రాజకిరణ్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాడని అంటున్నారు.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఒక టీవీ ఛానల్ వారు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడి ప్రతిభపైగల నమ్మకంతోనే వాళ్లు ఆ స్థాయి ధరను చెల్లించిన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏప్రిల్లో ఈ హారర్ థ్రిల్లర్ ను విడుదల చేయనున్నట్టు రాజకిరణ్ చెప్పారు. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ప్రభుదేవా 'దేవి 2' .. లారెన్స్ 'కాంచన 3' కూడా ఇదే నెలలో రానుండటం విశేషం.
Go Back to Shorts
nandita raj

More Telugu News