పనిమనిషిపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు...సహకరించిన భార్యకు జరిమానా
- పనిమనిషిపై యజమాని దారుణం
- స్నానం చేస్తుండగా దొంగచాటుగా చిత్రీకరణ
- బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడి
ఓ రోజు కడుపులో నొప్పిగా ఉందని ఆమె చెప్పగా వహీద్‌ఖాన్ భార్య మాత్రలు ఇచ్చింది. అవి వేసుకుని నిద్రలోకి జారుకున్నాక వహీద్ పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మేల్కొన్న తరువాత తనున్న పరిస్థితి చూసి యజమానురాలిని పనిమనిషి ప్రశ్నించగా సర్దిచెప్పింది. మరుసటి రోజు కూడా అలాగే జరగడంతో అనుమానించిన ఆ యువతి వహీద్‌ఖాన్ దంపతులను నిలదీసింది.
దీంతో ఖాన్ ఆమెకు బాత్‌రూంలో స్నానం చేస్తున్న దృశ్యాలు చూపించి బెదిరించాడు. ఆ యువతి భయపడడంతో అదే అదనుగా పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ యువతి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది.
తల్లికి విషయం చెప్పి ఆమె సహకారంతో 2006 జూన్‌లో బంజారాహిల్స్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారించి ఏఎంఎస్‌జె కోర్టుకు వివరాలు అందించగా, విచారించిన న్యాయమూర్తి నిందితునికి పదేళ్ల జైలు, అతని భార్యకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.