ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయలేకపోతున్నాం: నందమూరి వసుంధర
Add ap7am to your home Screen

ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయలేకపోతున్నాం: నందమూరి వసుంధర

  • ఇస్త్రీ బంకులో సందడి
  • ప్రజల నాడి తెలుసుకునేందుకే ప్రచారం
  • హిందూపురంలో బాలకృష్ణ భార్య ఇంటింటి ప్రచారం
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు హిందూపురంలోని అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలతో ఆమె మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఓ ఇస్త్రీ దుకాణంలో బట్టలు ఇస్త్రీ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా వసుంధర మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయలేకపోతున్నామని అన్నారు.

 2014 తర్వాత తమ పట్ల విశేష అభిమానం చూపుతున్నారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో అంతకు రెట్టింపుస్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే భారీ మెజారిటీ నమోదవుతుందని భావిస్తున్నట్టు వసుంధర పేర్కొన్నారు. తాను ఇంటింటికీ తిరుగుతుంటే, ఎందుకమ్మా మీరు కష్టపడడం, ప్రభుత్వ పథకాలన్నీ అందుతుంటే మా మద్దతు తప్పకుండా టీడీపీకే అని చెబుతున్నారని సంతోషం వెలిబుచ్చారు.
Balakrishna
Telugudesam

More Telugu News