అందుకే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను బాలకృష్ణకు అంకితం చేస్తున్నా: వర్మ
- ఎన్టీఆర్ బయోపిక్ తీయాలంటూ గతంలో బాలయ్య నన్ను కలిశారు
- కొందరు వ్యక్తులను తనకు పరిచయం చేశారు
- వారి నుంచే సమాచారం సేకరించా
తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని... ఏ పార్టీ నెగ్గినా తనకు లాభం లేదని, నష్టమూ లేదని వర్మ తెలిపారు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో సినిమా తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పాతికేళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను ఫిల్మ్ మేకర్ నని, బిజినెస్ మెన్ కాదని చెప్పారు.