విజయ్ మూవీలో జాకీ ష్రాఫ్ పవర్ఫుల్ రోల్
Add ap7am to your home Screen

విజయ్ మూవీలో జాకీ ష్రాఫ్ పవర్ఫుల్ రోల్

  • అట్లీకుమార్ తో విజయ్ మూడో మూవీ
  • కథానాయికగా నయనతార 
  • దీపావళికి భారీస్థాయి విడుదల    
తమిళనాట మాస్ కథాంశాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకునే దర్శకుల జాబితాలో అట్లీ కుమార్ చేరిపోయాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని .. వాళ్లకి కావలసిన అంశాలు తన సినిమాలో ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అందువలన అక్కడ మాస్ ఆడియన్స్ నుంచి ఆయన సినిమాలకి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.

ఆయన తాజా చిత్రం విజయ్ హీరోగా రూపొందుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. గతంలో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' భారీ విజయాలను అందుకున్నాయి. తాజా చిత్రంలో విజయ్ సరసన నాయికగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో కీలకంగా నిలిచే పవర్ఫుల్ పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యారు. 'మాయావనం' తరువాత జాకీ ష్రాఫ్ తమిళంలో చేస్తోన్న సినిమా ఇది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
vijay
nayanatara

More Telugu News