'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి డొనాల్డ్ ట్రంప్... మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ!
- సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేసుకునే వర్మ
- ట్విట్టర్ లో ఓ మార్ఫింగ్ వీడియో
- వర్మ సినిమాపై మాట్లాడినట్టు కనిపించే ట్రంప్
"ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయమేంటి?" అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, ఇది చర్చించాల్సిన అంశమేనని, ప్రతి ఒక్కరూ దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారని, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అంటున్నట్టు వినిపిస్తుంది. తన అభిప్రాయం తనకుందని కూడా ట్రంప్ చెబుతున్నట్టు ఉంది. ట్రంప్ గతంలో ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలకు, ప్రశ్నలు జోడించి, ఈ వీడియోను ఎడిటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఫన్నీగా ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి.