balakrishna: తమిళ హిట్ మూవీ రీమేక్ లో బాలకృష్ణ .. రాజశేఖర్?

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో కొంతకాలం క్రితం మాధవన్ .. విజయ్ సేతుపతి కలిసి చేసిన 'విక్రమ్ వేద' సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ .. కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా విజయ్ సేతుపతి నటించారు. పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్న నిర్మాత, ఇటీవలే బాలకృష్ణను .. రాజశేఖర్ ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ రీమేక్ లో ఈ ఇద్దరు చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. బాలకృష్ణతో కలిసి నటించడానికీ .. అవసరమైతే ఆయన సినిమాలో విలన్ గా చేయడానికి తాను సిద్ధమేనని కొంతకాలం క్రితం ఒక వేదికపై రాజశేఖర్ చెప్పారు. కనుక ఆయన అంగీకరించే అవకాశాలు ఎక్కువ. ఇక బాలకృష్ణ ఎలా స్పందిస్తాడనేదే ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
balakrishna
rajasekhar

More Telugu News