Andhra Pradesh: ఏబీఎన్ రాధాకృష్ణ అన్నా.. నీకు ఎయిడ్స్ ఉందేమో.. నాకు లేదు!: పోసాని కృష్ణమురళి సెటైర్లు

  • ఎస్టీలపై వ్యాఖ్యలు జగన్ చేసుంటే ఫ్రంట్ పేజీలో వచ్చేది
  • అక్షరాన్ని ఆయుధం చేయకున్నా వేశ్యగా చేయొద్దు
  • అబద్ధం ఆడేవాడిని  లంగా, లోఫర్ అని అంటారు
ఎస్టీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని ఒకవేళ జగన్ అని ఉంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వార్త వచ్చేదని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ‘జగన్ కు మదం. అహంకారం. ఇతనిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టండి అని చెప్పేవాడివి కదా రాధాకృష్ణ అన్నా’ అని వ్యాఖ్యానించారు.

‘రాధాకృష్ణ అన్నయ్యా.. నువ్వు అంటే నాకు చాలా గౌరవం. మీడియా పెట్టిన కొత్తల్లో నువ్వు ‘అక్షరం ఆయుధం’ అన్నావు. నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా ఫరవాలేదు కానీ, అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నా’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అబద్ధమాడేవాడిని లంగా, లోఫర్ అని అంటారనీ, ఇదంతా రాధాకృష్ణేనని దుయ్యబట్టారు. చంద్రబాబు అంటే ఇష్టమున్నప్పుడు మీరు ఎలాగైనా చేసుకోవచ్చనీ, తనపై తప్పుడు వార్తలు రాయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు కులపిచ్చి ఉందనీ, ఆయన మానసిక రోగి అని ఆరోపించారు.

అందుకే ఎస్టీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని చెప్పగలిగారన్నారు. చంద్రబాబు కాళ్లు నాకుతూ నామినేటెడ్ పదవి తెచ్చుకుని విలువ దిగజార్చుకుని తాను బతకడం లేదన్నారు. తాను అబద్ధం ఆడితే తాను ఒప్పుకుంటాననీ, మీడియా ప్రతినిధుల కాళ్లకు మొక్కి క్షమాపణలు చెబుతానన్నారు. ‘రాధాకృష్ణ అన్నా.. నీకు ఎయిడ్స్ ఉందేమో.. నాకు మాత్రం ఏ రోగాలు లేవు’ అని సెటైర్లు వేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Posani Krishna Murali
abn
radhakrishna

More Telugu News