'భారతీయుడు 2' ముందుకు వెళ్లకపోవడానికి అసలు కారణం అదేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భారతీయుడు 2' ముందుకు వెళ్లకపోవడానికి అసలు కారణం అదేనట!

  • 'సేనాపతి' పాత్రలో కమల్ 
  • మేకప్ కారణంగా స్కిన్ అలర్జీ
  • సవ్యంగా సాగని షూటింగ్  
శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆయన అప్పటి నుంచి అనుకుంటూనే వున్నాడు. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ ను ఆయన పట్టాలెక్కించగలిగాడు. కమల్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా కాజల్ కనిపించనుంది.

ఈ సినిమా తొలి షెడ్యూల్ సమయంలోను .. ఆ తరువాత షూటింగు విషయంలో గ్యాప్ ఎక్కువగా వస్తోంది. అనుకున్నట్టుగా షూటింగు జరగకపోవడంతో, దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. కానీ షూటింగు సవ్యంగా సాగకపోవడానికి అసలు కారణం కమల్ మేకప్ అని తెలుస్తోంది. గతంలో కమల్ కి సేనాపతి పాత్రకి గాను వృద్ధుడిగా మేకప్ వేస్తే ఏమీ కాలేదు. కానీ ఈ సారి ఆయనకి వృద్ధుడిగా మేకప్ వేసిన ప్రతిసారి స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారట. అందువల్లనే షూటింగ్ ఆపారని అంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి. 
kamal
kajal

More Telugu News