హీరోగా ఆది పినిశెట్టి .. కీలకమైన పాత్రలో హన్సిక .. కొత్త సినిమా లాంచ్
- ఆది పినిశెట్టి హీరోగా తమిళ సినిమా
- దర్శకుడిగా మనోజ్ దామోదరన్
- తెలుగులోనూ రిలీజ్ చేసే ఛాన్స్
తాజాగా హీరోగా ఆయన మరో సినిమాను అంగీకరించాడు. ఈ సినిమాకి 'పార్ట్ నర్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఆర్ ఎఫ్ సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాకి మనోజ్ దామోదరన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కీలకమైన పాత్రలో హన్సిక నటిస్తున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వెంటనే రెగ్యులర్ షూటింగును కూడా మొదలుపెట్టేయనున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయి.