రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు ఫ్యాన్స్ సూచిస్తున్న టైటిల్స్!
Add ap7am to your home Screen

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు ఫ్యాన్స్ సూచిస్తున్న టైటిల్స్!

  • 'బాహుబలి' తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా
  • పేరు పెట్టే బాధ్యతను అభిమానులకు అప్పగించిన రాజమౌళి
  • ఉత్సాహంగా పేర్లు పెడుతున్న అభిమానులు
సినిమాకు టైటిల్‌ అంటే ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎన్నో రెట్లు పెంచిన 'బాహుబలి' తరువాత దర్శక దిగ్గజం రాజమౌళి తీస్తున్న సినిమా వర్కింగ్ టైటిల్ 'ఆర్ఆర్ఆర్' అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ఏం పేరు పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. సినిమాకు పేరు పెట్టే బాధ్యతను అభిమానులపై ఉంచారు రాజమౌళి.

ఇంకేముంది... ఫ్యాన్స్ తమదైన శైలిలో పేర్లు పెట్టడం ప్రారంభించారు. వీటిల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. 'రఘుపతి రాఘవ రాజారాం', 'రం రం రుథిరం', 'రామ రావణ రాజ్యం', 'రౌద్ర రణ రంగం' ఇలా ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిల్లో కొన్నింటిని రాజమౌళి సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ తారలు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
RRR
Rajamouli
NTR
Ramcharan
Abrivations

More Telugu News