అభినవ శిశుపాలుడు చంద్రబాబు.. ‘ఫ్యాన్’ చక్రం తగిన బుద్ధి చెబుతుంది: వైఎస్ జగన్
- శిశుపాలుడిని విష్ణు చక్రం సంహరించింది
- మోసాలు చేసిన బాబుకు ‘ఫ్యాన్’ చక్రం బుద్ధిచెబుతుంది
- ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదు
ఏపీ ప్రజలు తనను ‘పెద్దకొడుకు’గా భావిస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ ఘాటు విమర్శలు చేశారు. 'ఈయన పెద్దకొడుకుట. మీరే మన్నా ఆయన్ని దత్తత తీసుకుంటారా?’ అని సెటైర్లు విసిరారు. తనకు పిల్ల నిచ్చిన మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా వదల్లేదని, ఇక, ఈయనను పెద్దకొడుకుగా మనం దత్తత తీసుకుంటే, మనం బ్రతుకుతామా? అని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని, తమ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను ఈ సందర్భంగా జగన్ కోరారు.