నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో ‘జనసేన’ చర్చలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో ‘జనసేన’ చర్చలు!

  • టికెట్ దక్కకపోవడంతో ఎస్పీవై రెడ్డి అసంతృప్తి
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయం
  • నంద్యాల ఎంపీగా ఆయన్ని పోటీ చేయాలని ఆహ్వానించిన ‘జనసేన’
టీడీపీ ప్రకటించిన తమ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి చోటు దక్కని విషయం తెలిసిందే.  దీంతో, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్పీవై రెడ్డితో జనసేన అధిష్ఠానం సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్పీవై రెడ్డిని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాల సమాచారం.  
nandyala
mp spy reddy
janasena
Pawan Kalyan

More Telugu News