'ఆర్ ఆర్ ఆర్' లో మరో విప్లవ వీరుడిగా అజయ్ దేవగణ్
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- సెకండాఫ్ లో రానున్న అజయ్ దేవగణ్
- భగత్ సింగ్ లక్షణాలతో కూడిన పాత్ర
ఈ నేపథ్యంలో .. అజయ్ దేవగణ్ పాత్ర .. భగత్ సింగ్ లక్షణాలతో కూడినదిగా కనిపిస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సెకండాఫ్ లో దాదాపు అరగంట పాటు నడిచే ఎపిసోడ్ లో అజయ్ దేవగణ్ పాత్ర విశ్వరూపం కనిపిస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తు .. అజయ్ దేవగణ్ కనిపించేంతవరకూ ఒక ఎత్తు అనే విధంగా ఆయన పాత్రను రాజమౌళి డిజైన్ చేశాడని చెబుతున్నారు. 2002లో అజయ్ దేవగణ్ చేసిన 'ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్' ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో ఆయన యాక్షన్ చూసిన తరువాతనే రాజమౌళి ఈ పాత్రకి ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.