'ఆర్ ఆర్ ఆర్' మూవీ కోసం అలియా భట్ కి భారీ పారితోషికం
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రిలీజ్
- జూలై 30వ తేదీన విడుదల
'రాజీ' సినిమా హిట్ తరువాత అలియా భట్ తన పారితోషికాన్ని 10 కోట్లకి చేర్చిందట. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను 'ఆర్ ఆర్ ఆర్' సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది గనుక, పారితోషికంగా ఆమె 15 కోట్లను డిమాండ్ చేసినట్టుగా సమాచారం. ఆ తరువాత జరిగిన బేరసారాల కారణంగా ఆమెకి 12నుంచి 15 కోట్ల లోపు పారితోషికం అందనుందని చెప్పుకుంటున్నారు. 2020 జూలై 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.