రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లున్న వారు 30 లక్షల మంది: ఏపీ సీఈఓ
- రాజకీయ ఫిర్యాదు మేరకు ఈసీఐకి లేఖ రాసిన ద్వివేదీ
- ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు
- రెండు చోట్లా ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఈసీ
ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఒకేరోజు లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారు అక్కడ ఓటేసి ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే డూప్లికేట్ ఓట్ల విషయంపై ఈసీఐకి లేఖ రాసినట్టు ద్వివేదీ తెలిపారు. ఈసీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఆదేశాలు అందగానే రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారి ఓట్లను తొలగించనున్నట్టు తెలిపారు.