దర్శక నిర్మాతల మధ్య విభేదాలు .. ఆగిపోయిన 'భారతీయుడు 2' షూటింగ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శక నిర్మాతల మధ్య విభేదాలు .. ఆగిపోయిన 'భారతీయుడు 2' షూటింగ్?

  • ఇటీవలే మొదలైన షూటింగ్ 
  • పరిమితిని దాటిపోయిన బడ్జెట్
  • నిర్మాతల అసహనం         
రజనీతో '2.ఓ' సినిమాకి ఎక్కువ సమయం తీసుకున్న శంకర్, 'భారతీయుడు 2' కోసం కమల్ తో సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. చకచకా రంగాన్ని సిద్ధం చేసుకుని శంకర్ సెట్స్ పైకి వెళ్లాడు. తొలి షెడ్యూల్ సమయంలోనే షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. దర్శక నిర్మాతల మధ్య బడ్జెట్ కారణంగా వచ్చిన మనస్పర్థలే కారణమని అంతా చెప్పుకున్నారు. ఒక దశలో వేరే నిర్మాతలను వెతికేపనిలో శంకర్ పడినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

అలాంటిదేమీ లేదంటూ ఈ సినిమా టీమ్ మళ్లీ షూటింగును మొదలెట్టేసింది. తొలి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత, తదుపరి షెడ్యూల్ షూటింగును నిలిపేశారనే టాక్ కోలీవుడ్లో షికారు చేస్తోంది. తొలి షెడ్యూల్ లోనే తాము అనుకున్న పరిమితికి మించి ఖర్చు చేయించిన కారణంగా నిర్మాతలు శంకర్ పై అసహనాన్ని వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇలా 'భారతీయుడు 2' షూటింగ్ దినదిన గండంగా మారడం .. కమల్ అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. 
kamal
kajal

More Telugu News