అదంతా పుకారే .. ఎన్టీఆర్, మహేశ్ లతో 'కేజీఎఫ్' దర్శకుడి సినిమా లేనేలేదట!
Add ap7am to your home Screen

అదంతా పుకారే .. ఎన్టీఆర్, మహేశ్ లతో 'కేజీఎఫ్' దర్శకుడి సినిమా లేనేలేదట!

  • ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ కలవలేదు
  •  మహేశ్ బాబు నుంచి కబురు వెళ్లలేదు
  • 'కేజీఎఫ్ చాప్టర్ 2'పైనే దృష్టి      
ఈ మధ్య కాలంలో కన్నడలో నిర్మితమైన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు .. హిందీ భాషల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా ఈ సినిమా ప్రశాంత్ నీల్ కి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తెలుగులో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడనీ, ఎన్టీఆర్ కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడనే టాక్ వచ్చింది.

ఇక ప్రశాంత్ నీల్ కి మహేశ్ బాబు నుంచి కూడా కబురు వెళ్లిందనీ, ఆల్రెడీ లైన్ వినిపించడం జరిగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండు వార్తల్లోను ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. అసలు ఎన్టీఆర్ - మహేశ్ బాబులను ఆయన కలవలేదు .. వాళ్ల నుంచి ఆయనకి కబురూ వెళ్లలేదనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ - మహేశ్ బాబు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ కూడా ఉత్తరాది నటులతో 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో తీరికలేకుండా వున్నాడట. 
ntr
Mahesh Babu
prashanth neel

More Telugu News