Congress: ప్రియాంక పేరు లేకుండా లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

షార్ట్స్‌లో చూడండి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు మీదున్నాయి. ముఖ్యంగా, యువనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో గురువారం లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 15 మందితో కూడిన ఈ జాబితాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరులేదు. ఇక, రాహుల్ గాంధీ, సోనియా తమకు అచ్చొచ్చిన అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఈ తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది, గుజరాత్ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు.
Go Back to Shorts
Congress
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News