రికార్డులు సృష్టిస్తోన్న 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రికార్డులు సృష్టిస్తోన్న 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2'

  • షూటింగు దశలో 'సాహో'
  • మేకింగ్ వీడియోకి భారీ రెస్పాన్స్ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల      
ప్రభాస్ తాజా చిత్రంగా .. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవల శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకి వస్తోన్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ వీడియోను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 12 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో 79 మిలియన్ల మందికి రీచ్ అయింది. అదే 24 గంటల్లో 2.9 మిలియన్లకి పైగా లైక్స్ ను సాధించింది. 24 గంటల్లోనే ఈ స్థాయి వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టిన మేకింగ్ వీడియోగా 'సాహో' కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికీ ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు
prabhas
shraddha kapoor

More Telugu News