ఎయిర్ పోర్టులో ప్రభాస్ కు వింత అనుభవం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ పోర్టులో ప్రభాస్ కు వింత అనుభవం

  • ఫొటో అడిగి చెంప నిమిరిన అమ్మాయి
  • ఊహించని ఘటనతో ఆశ్చర్యపోయిన ప్రభాస్
  • చెంప తడుముకుంటూ నవ్వుకున్న వైనం
టాలీవుడ్ హీరో ప్రభాస్ కు శంషాబాద్ విమానాశ్రయంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ అన్న తర్వాత సినీ తారలతో ఫొటోలకు ఉత్సాహం చూపించడం సాధారణమైన విషయమే అయినా ఒక్కోసారి వాళ్లు అత్యుత్సాహం చూపించి తారలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ప్రభాస్ కూడా ఓ అభిమాని ఆనందం పట్టలేక చేసిన చర్యతో విస్మయానికి గురయ్యాడు. శంషాబాద్ విమానాశ్రయంలో తన అసిస్టెంట్ తో కలిసి బయటికి వస్తున్న ప్రభాస్ ను చూసి ఓ యువతి, యువకుడు ఎంతో ఉద్విగ్నతకు గురయ్యారు. ముఖ్యంగా అ యువతి ప్రభాస్ ను చూడగానే ఆనందం పట్టలేకపోయింది. ఫుల్ హ్యాండ్స్ కాటన్ షర్ట్, హాఫ్ ప్యాంట్స్ తో ఉన్న ఆ యువతి పరుగున వెళ్లి ఫొటో ప్లీజ్ అనడంతో ప్రభాస్ ఒప్పుకున్నాడు.

 సంతోషంతో ఊగిపోతున్న ఆ యువతి ఫొటో కంప్లీట్ అవ్వగానే ప్రభాస్ చెంపపై సుతారంగా కొట్టింది. ప్రభాస్ ఆమె చర్యకు కాసేపు సంభ్రమం చెందాడు. అనంతరం నవ్వుకుంటూ తన చెంపను తడిమి చూసుకున్నాడు. అంతలో ఆ యువతితో ఉన్న యువకుడు కూడా ప్రభాస్ తో ఫొటో దిగాడు. మొత్తానికి ఆ అమ్మాయి మాత్రం తనకు దక్కిన అదృష్టానికి విపరీతంగా పొంగిపోయింది. వాళ్లిద్దరే కాదు వాళ్ల స్నేహబృందంలోని మరికొందరు కూడా ప్రభాస్ తో గ్రూప్ ఫొటో దిగి పట్టలేని సంతోషం సొంతం చేసుకున్నారు.

Prabhas
Tollywood

More Telugu News