ఆలోచనలో పడిన బోయపాటి!
Add ap7am to your home Screen

ఆలోచనలో పడిన బోయపాటి!

  • బోయపాటి నెక్స్ట్ మూవీ బాలకృష్ణతో
  • ఎన్నికల హడావిడిలో బాలకృష్ణ
  •  సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం  
ఈ ఏడాది ఆరంభంలోనే బోయపాటి 'వినయ విధేయరామ'తో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఆయనకి ఎన్నో విమర్శలను కూడా తెచ్చిపెట్టింది. బాలకృష్ణతో చేయనున్న సినిమాతో ఆ విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని బోయపాటి నిర్ణయించుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లిపోవాలని భావించాడు. అయితే ఎన్నికల కారణంగా జూన్ తరువాత ఈ ప్రాజెక్టుపై దృష్టి పెడతానని బాలకృష్ణ అనడంతో బోయపాటి నిరాశకి లోనయ్యాడు.

ఇక ఇటీవల బాలకృష్ణ సొంత బ్యానర్లో వచ్చిన 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' సినిమాలు ఆయనకి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. దాంతో ఇకపై సినిమాల నిర్మాణాన్ని కొనసాగించాలా .. వద్దా? అనే విషయాన్ని గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం బోయపాటిని మరింత టెన్షన్ పెడుతోందట. అప్పటికప్పుడు వేరే నిర్మాతను సెట్ చేసుకోవడం కూడా అంత తేలికైన విషయం కాకపోవడంతో బోయపాటి ఆలోచనలోపడ్డాడట. ఈ ఏడాది బోయపాటి నుంచి మరో సినిమా వస్తుందా లేదో చూడాలి మరి.
balakrishna
boyapati

More Telugu News