అభినందన్‌ను మించిన హీరోను ఈ భూమ్మీద ఇప్పటి వరకు చూడలేదు: టీమిండియా బౌలర్ అశ్విన్
- మూడు రోజులు పాక్ చెరలో ఉన్న భారత పైలట్
- ఇలాంటి హీరో లేడంటూ ప్రశంస
- ‘అభినందన్‌కు స్వాగతం’ అంటూ ట్వీట్
పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను తరుముకుంటూ వెళ్లిన అభినందన్ తన మిగ్ విమానం కూలిపోవడంతో సురక్షితంగా ల్యాండయ్యాడు. అయితే, అతడు దిగింది పాక్ భూభాగం కావడంతో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ దౌత్యపరంగా చేసిన ఒత్తిడితో దిగొచ్చిన పాక్ శుక్రవారం అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది.