చైతూ చేతుల మీదుగా 'సూర్యకాంతం' నుంచి సెకండ్ సాంగ్
Add ap7am to your home Screen

చైతూ చేతుల మీదుగా 'సూర్యకాంతం' నుంచి సెకండ్ సాంగ్

  • నిహారిక నుంచి 'సూర్యకాంతం'
  • దర్శకుడిగా ప్రణీత్ రెండో పాట
  •  రిలీజ్ కి సన్నాహాలు  
'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. తనకి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. నిహారిక ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, ఆమెకి జోడీగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రిందట ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా మరో పాటను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ పాటను నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిహారిక ఈ సినిమాలో విలక్షణమైన పాత్రను పోషిస్తోందనీ, ఈ సినిమా ఆమెకి మంచి పేరు తెస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
niharika
rahul vijay

More Telugu News