Virat Kohli: ​ కోహ్లీ ఖాతాలో మరో ఈజీ రికార్డు

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆదివారం వైజాగ్ లో ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్ ద్వారా కోహ్లీ ఆసీస్ పై మొత్తం 500 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్ మన్ గా రికార్డు స్థాపించాడు. అంతర్జాతీయ టి20 పోటీల్లో ఆసీస్ పై ఇప్పటివరకు ఎవరూ 500 పరుగులు చేయలేదు.

ఇప్పటివరకు ఆసీస్ పై టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జేపీ డుమినీ పేరిట ఉంది. డుమినీ ఆస్ట్రేలియా జట్టుపై 15 మ్యాచ్ లాడి 378 పరుగులు చేశాడు. కోహ్లీ 14 మ్యాచ్ లలోనే 500 పరుగులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే వైజాగ్ మ్యాచ్ లో కోహ్లీ 17 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు చేరుకోగానే ఆసీస్ పై మొత్తం 500 పరుగులు సాధించినట్టయింది.
Go Back to Shorts
Virat Kohli

More Telugu News