జార్ఖండ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ముగ్గురిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- జార్ఖండ్ లోని గుమ్లాలో ఎన్ కౌంటర్
- లొంగిపోవాలని కోరినా కాల్పులు జరిపిన మావోలు
- ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్
దీంతో గుమ్లా సమీపానికి రాగానే భద్రతాబలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని అధికారులు కోరగా, మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు కూడా ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
కాగా, కాల్పులు ఆగిపోయిన అనంతరం ఘటనాస్థలం నుంచి ముగ్గురు మావోల మృతదేహాలతో పాటు రెండు ఏకే-47 తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు గాలింపును కొనసాగిస్తున్నాయి.