సమస్య పరిష్కారం .. మళ్లీ పట్టాలెక్కుతోన్న 'భారతీయుడు 2'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమస్య పరిష్కారం .. మళ్లీ పట్టాలెక్కుతోన్న 'భారతీయుడు 2'

  • దర్శక నిర్మాతల మధ్య తొలగిన మనస్పర్థలు
  •  కమల్ కోసం మేకప్ మేన్లు రంగంలోకి
  •  సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఖరారు           
రజనీకాంత్ '2.ఓ' సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, శంకర్ 'భారతీయుడు 2' సినిమాకి సంబంధించిన పనులను ఒక కొలిక్కి తీసుకొచ్చేశాడు. రజనీ సినిమా విడుదలైన తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే 'భారతీయుడు 2' సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు. కొన్ని రోజులపాటు చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత షెడ్యూల్ మొదలుకాక పోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం మొదలైపోయింది.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా రెహ్మాన్ కావాలని కమల్ పట్టుబడుతున్నారనీ .. ఆయన లుక్ విషయంలో శంకర్ అసంతృప్తితో ఉన్నారనీ .. నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారితో శంకర్ కి మనస్పర్థలు వచ్చాయని .. ఇలా అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు ప్రాజెక్టు ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని భావించిన దర్శక నిర్మాతలు చర్చలకు దిగారట.

కమల్ లుక్ విషయంపై శ్రద్ధ పెట్టి మేకప్ మేన్ లను రప్పిస్తున్నారని సమాచారం. ఇక సంగీత దర్శకుడిగా అనిరుధ్ నే ఖాయం చేసేశారని తెలుస్తోంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టేస్తారట. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. 
kamal
kajal

More Telugu News