రానా.. నువ్వు ఒరిజినల్ చంద్రబాబు కంటే ఒరిజినల్ గా కనిపిస్తున్నావ్!: రాంగోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానా.. నువ్వు ఒరిజినల్ చంద్రబాబు కంటే ఒరిజినల్ గా కనిపిస్తున్నావ్!: రాంగోపాల్ వర్మ

  • మహానాయకుడు స్టిల్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ
  • రానా హావభావాలపై ప్రశంసలు
  • థాంక్యూ చెప్పిన రానా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు హీరో రానా దగ్గుబాటిపై ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా రేపు విడుదల కానుంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించాడు.

ఈ నేపథ్యంలో సినిమాలోని ఓ స్టిల్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ..‘హే రానా దగ్గుబాటి. నువ్వు చంపేశావ్. నువ్వు ఒరిజినల్(చంద్రబాబు) కంటే ఒరిజినల్ గా కనిపిస్తున్నావ్’ అని ప్రశంసించారు. దీంతో రానా వెంటనే స్పందిస్తూ..‘థ్యాంక్యూ’ అని జవాబిచ్చాడు.
rana
Twitter
RGV
praise
Tollywood

More Telugu News