ఎనిమిది నెలల గర్భవతిగా వుండి .. షూటింగ్ కోసం కొండలను ఎక్కవలసి వచ్చింది: వై విజయ
Add ap7am to your home Screen

ఎనిమిది నెలల గర్భవతిగా వుండి .. షూటింగ్ కోసం కొండలను ఎక్కవలసి వచ్చింది: వై విజయ

  • గర్భవతిగా వుండి 24 సినిమాలు అంగీకరించాను
  •  రజనీ సినిమా క్లైమాక్స్ కి నాకు 8వ నెల
  •  రజనీ సార్ వద్దన్నా చేశాను      
తెలుగులోని కేరక్టర్ ఆర్టిస్టులలో వై.విజయ స్థానం ప్రత్యేకమని చెప్పాలి. వందలాది సినిమాల్లో నటించిన అనుభవం ఆమె సొంతం. అలాంటి వై.విజయ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పారు. "నేను కేరక్టర్ ఆర్టిస్టును గనుక, ఏ సినిమా అయినా నాకు సంబంధించిన షూటింగ్ వారం రోజుల లోపే పూర్తవుతుంది. అందువలన నేను గర్భవతిగా వున్నప్పుడు కూడా 24 సినిమాలను అంగీకరించాను.

తమిళంలో రజనీకాంత్ హీరోగా 'రాజాధి రాజా' సినిమాను కూడా ఒప్పుకున్నాను. ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు నాకు 3వ నెల. క్లైమాక్స్ చిత్రీకరించే సమయానికి నాకు 8వ నెల. కోయంబత్తూరులోని ఒక కొండపై షూటింగ్. కుర్చీలో కూర్చోబెట్టి నన్ను పైకి తీసుకురమ్మని రజనీకాంత్ గారు చెప్పారు. ఫరవాలేదు లెండి అని చెప్పి, నేను కొండపైకి ఎక్కాను. ఆ తరువాత ఆ కొండ కాదు అని చెప్పేసి డైరెక్టర్ గారు మరో కొండ ఎక్కించారు. ఆ సమయంలో రజనీకాంత్ గారు నేను ఇబ్బంది పడతాననే ఉద్దేశంతో, నా పాత్ర లేకుండా షూట్ చేయమన్నారు. సీన్ పరంగా తప్పదని దర్శకుడు చెప్పడంతో ఆ పక్కనున్న కొండను కూడా ఎక్కేశాను. అంత కమిట్మెంట్ తో పనిచేసేదానిని" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
y. vijay

More Telugu News