పోటీ నుంచి తప్పుకుంటానన్న టీడీపీ నేత తోట నర్సింహం.. జగ్గంపేటపై కన్ను!
- తనకు బదులుగా భార్యకు ఛాన్సివ్వాలని విన్నపం
- ఈరోజు కుటుంబంతో కలిసి చంద్రబాబుతో భేటీ
- జగ్గంపేట నుంచి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం
ఈ నేపథ్యంలో తోట నర్సింహం తన కుటుంబ సభ్యులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం కలుసుకోనున్నారు. తమ డిమాండ్లను పార్టీ అధినేత ముందు ఉంచనున్నారు. కాగా, జగ్గంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.