ముహూర్తం రేపు ఉదయం 11.30... తెలంగాణ కొత్త మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముహూర్తం రేపు ఉదయం 11.30... తెలంగాణ కొత్త మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు!

  • క్యాబినెట్ లో 8 నుంచి 10 మందికి చాన్స్
  • ఇప్పటికే పేర్లను ఖరారు చేసిన కేసీఆర్
  • కేటీఆర్, హరీశ్ రావులకు ప్రస్తుతానికి నో చాన్స్
టీఆర్ఎస్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా రాజ్ భవన్ కు చేరగా, ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారిని గవర్నర్ కార్యాలయ అధికారులు ఆహ్వానిస్తున్నారు. క్యాబినెట్ లో 8 నుంచి 10 మందికి స్థానం లభించనున్నట్టు తెలుస్తోంది. నిన్ననే కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్న కేసీఆర్, తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులను ప్రస్తుతానికి దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రుల జాబితా ఇప్పటికే లీకైంది కూడా. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని, గత రెండు నెలలుగా టీఆర్ఎస్ భవన్ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.
KCR
Harish Rao
KTR
Cabinet

More Telugu News