'అరవింద సమేత' కోసం అడిగారు .. అందుకే చేయలేదు: హీరోయిన్ 'లయ'
Add ap7am to your home Screen

'అరవింద సమేత' కోసం అడిగారు .. అందుకే చేయలేదు: హీరోయిన్ 'లయ'

  • కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న 'లయ' 
  • వివాహం తరువాత నటనకి దూరం 
  • వయసుకి మించిన పాత్రలు చేయదలచుకోలేదు   
తెలుగు తెరపై సంప్రదాయ బద్ధమైన కథానాయికగా 'లయ' పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి ఆమె ఎంత సున్నితంగా ఎంట్రీ ఇచ్చిందో .. వివాహం తరువాత అంతే సున్నితంగా సినిమాలకి దూరం జరిగింది. అలాంటి 'లయ' తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపిన ఆదరాభిమానాలను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను' అని అంది.

 'పెళ్లి తరువాత సినిమాలు చేయకూడదని మా వారు అనలేదు .. ఆయన తరఫు నుంచి ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. పిల్లలను దగ్గరుండి చూసుకోవాలని నేనే చేయడం లేదు. నాకు ఇంకా వదిన పాత్రలు .. తల్లి పాత్రలు వేసే వయసు రాలేదు. నా వయసుకి తగిన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను. 'అరవింద సమేత'లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అడిగారు. నా వయసుకి మించిన పాత్ర కావడం వల్లనే చేయలేదు" అని చెప్పుకొచ్చింది. 
laya

More Telugu News