సిద్ధిపేటలో రూ.10కే చీర ఆఫర్ పెట్టిన షాపింగ్ మాల్.. ఎగబడిన మహిళలు.. తీవ్ర తొక్కిసలాట!
- పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- నగలు, పర్సులు కొట్టేసిన దొంగలు
- ఒక్కసారిగా మాల్ గేటు తెరవడంతో ఘటన
ఈ సందర్భంగా చాలామంది మహిళలు కిందపడిపోగా, వారిని తొక్కుకుంటూ మిగతావారు ముందుకెళ్లిపోయారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో మాల్ సిబ్బంది వీరిని ఆసుపత్రికి తరలించారు. కాగా, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా దొంగలు సైతం తమ చేతివాటం చూపారు. చీరలకు ఆశపడి వచ్చిన కస్టమర్ల నగలు, మొబైల్ ఫోన్లు,పర్సులు దొంగలించేశారు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకున్నారు.