ఉగ్ర దాడి ఘటనపై సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు!
- ఉగ్రవాదుల దాడి ఓ పిరికిపంద చర్య
- ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి
- కొంతమంది చేసిన తప్పుకు యావత్తు దేశాన్ని నిందించడం తగదు
ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఉగ్రవాదుల దాడి ఓ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.అయితే, కొంతమంది చేసిన తప్పుకు దేశం మొత్తాన్ని నిందించడం తగదంటూ ఆయన పాకిస్థాన్ ను వెనకేసుకొస్తున్న తీరు కలకలం రేపుతోంది.
కాగా, గతంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ ను సిద్ధూ కౌగిలించుకోవడం వివాదాస్పదమైంది.