తండ్రి కోరిక నెరవేర్చడం కోసమే ప్రభాస్ 'బాహుబలి' చేశాడట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రి కోరిక నెరవేర్చడం కోసమే ప్రభాస్ 'బాహుబలి' చేశాడట

  • 'బాహుబలి'తో భారీగా పెరిగిన క్రేజ్
  • ప్రపంచవ్యాప్తంగా అభిమానులు
  • ఆ సమయంలో మరో సినిమా చేయని ప్రభాస్    
'బాహుబలి' సినిమా ప్రభాస్ క్రేజ్ ను ఆకాశమే హద్దుగా తీసుకెళ్లింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులను సంపాదించిపెట్టింది. 'బాహుబలి' .. 'బాహుబలి 2' రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవరకూ ప్రభాస్ మరోప్రాజెక్టు చేయకపోవడం గురించి విశేషంగా చెప్పుకున్నారు. ఆయన అంత సమయాన్ని కేటాయించడానికి ఈ ప్రాజెక్టుపై వున్న నమ్మకం ఒక కారణమైతే .. భారీ రెమ్యునరేషన్ మరో కారణమనే టాక్ వినిపించింది.

అయితే అసలు ఈ ప్రాజెక్టును తాను ఒప్పుకోవడానికి కారణం తన తండ్రి సూర్యనారాయణ రాజు అని తాజా ఇంటర్యూలో ప్రభాస్ చెప్పాడు. తనని వెండితెరపై ఒక రాజులా చూడాలనే కోరిక తన తండ్రికి వుండేదనీ, అందువలన రాజుల నేపథ్యంలో సాగే 'బాహుబలి' చేయడానికి వెంటనే అంగీకరించానని అన్నాడు. అలా ఈ సినిమా చేసి .. విజయాన్ని అందుకుని నాన్న కోరిక నెరవేర్చానని చెప్పుకొచ్చాడు. 
prabhas
anushka

More Telugu News