ntr: రాజమౌళి మల్టీ స్టారర్ నుంచి ముందుగా రానున్న చరణ్ ఫస్టులుక్

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ఎన్టీఆర్ బందిపోటుగా .. చరణ్ 'రామరాజు' అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం ముగ్గురు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా అలియా భట్ ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రాలేదు. ఎన్టీఆర్ .. చరణ్ లలో ఎవరి ఫస్టులుక్ ముందుగా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫస్టులుక్ ముందుగా రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫస్టులుక్ ను వదలనున్నట్టు సమాచారం. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని 'బాహుబలి' తరహాలోనే ఒక్కో లుక్ ను వదులుకుంటూ వస్తారట.
Go Back to Shorts
ntr
charan

More Telugu News