kamal: 'భారతీయుడు 2' నుంచి రానున్న మరో హీరో ఫస్టులుక్

షార్ట్స్‌లో చూడండి
కమల్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలైంది. చెన్నై శివార్లలో వేసిన భారీ సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

దాంతో ఈ సినిమాలో సిద్ధార్థ్ వున్నాడా .. లేడా అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సిద్ధార్థ్ లుక్ ను రిలీజ్ చేసే ఉద్దేశంతో శంకర్ ఉన్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా షూటింగులో సిద్ధార్థ్ ఇంకా పాల్గొనలేదు. అందువలన సెట్స్ కి సిద్ధార్థ్ రాగానే .. ఆయన ఈ సినిమా చేస్తున్నాడనే విషయాన్ని ఖరారు చేస్తూ .. ఫస్టులుక్ వదలడానికి శంకర్ సిద్ధం చేస్తున్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
Go Back to Shorts
kamal
kajal
siddhardh

More Telugu News