‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కు బ్రేక్.. దుబాయ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్న ఎన్టీఆర్!
- రామరాజు అనే పవర్‌ఫుల్ పాత్రలో చెర్రీ
- సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’
- స్వామి కార్యం, స్వకార్యం చక్కబెడుతున్న ఎన్టీఆర్
అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పూర్తిగా విరామమిచ్చారో లేదంటే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందో కానీ యంగ్ టైగర్ మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు. అయితే అక్కడ స్వామి కార్యం.. స్వకార్యం రెండూ చక్కబెడుతున్నాడట. ఒకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు కావల్సిన కాస్ట్యూమ్స్ కొనుక్కోవడంతో పాటు బాడీ మేకోవర్‌ని మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాడట. ఈ నెలాఖరు వరకూ తారక్ దుబాయ్‌లోనే ఉంటాడని సమాచారం.