మెగా మేనల్లుడి మూవీలో విలన్ గా తమిళ స్టార్ హీరో
- దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
- హీరోగా వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమా
- ప్రత్యేక ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
మైత్రీ మూవీ మేకర్స్ .. సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ తరహా పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశంతో ఆయనను తీసుకున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.